కార్తీ స్పై యాక్షన్ మూవీ ఆకట్టుకుందా?! (Sardar 2 Movie Review)

కార్తీ సినిమాలకు తెలుగు లో మంచి మార్కెట్ ఉంది. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కార్తీ హీరో గా నటించిన సర్దార్ మూవీ 2022 అక్టోబర్ 21 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో దేశంలో జరుగుతున్న మంచి నీటి వ్యాపారం పై దృష్టి పెట్టి ఆసక్తికరంగా సర్దార్ మూవీ ని తెరకెక్కించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు సర్దార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సర్దార్ ఫస్ట్ పార్ట్ లో దర్శకుడు పీ ఎస్ మిత్రన్ మంచి నీటి వ్యాపారం...ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటి వినియోగం వాళ్ళ జరిగే నష్టాలపై మెసేజ్ ఇస్తూ సినిమాను తెరకెక్కించాడు. అది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. దీంతో సర్దారు 2 పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. సర్దార్ రెండవ పార్ట్ లో మాత్రం యాంటీ బయాటిక్స్ విరివిగా వాడటం వాళ్ళ ఎదురవుతున్న సమస్యలతో పాటు బయో వార్స్ కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే రెండవ పార్ట్ అంటే సర్దార్ 2 ప్రేక్షకులను అంతగా ఎంగేజ్ చేయలేకపోయింది అనే చెప్పాలి.
కార్తీ యాక్షన్ విషయానికి వస్తే ఎక్కడా కూడా లోటు లేకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి నటన కనపరిచాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కార్తీ వన్ మ్యాన్ షో. కార్తీ తర్వాత పవర్ ఫుల్ రోల్ అంటే ఈ మూవీ లో బ్లాక్ డాగర్ పాత్రలో కనిపించిన ఎస్ జె సూర్య దే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఉన్న హీరోయిన్స్ మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ల పాత్రలకు అంత ప్రాధాన్యత లేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో కార్తీ, మాళవిక మోహనన్ లు రా ఏజెంట్స్ గా కనిపిస్తారు. ఈ సినిమా అంతా కూడా డోకు అనే బయో వెపన్ చుట్టూ తిరుగుతుంది.
దీన్ని దక్కించుకుని దేశాన్ని నాశనం చేయాలనీ చూసే విలన్ బ్లాక్ డాగర్ ఒక వైపు...శత్రువులకు చిక్కకుండా దీన్ని ఎలాగైనా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో పనిచేసే రా టీం మరో వైపు. వీటితో వచ్చే సన్నివేశాలతోనే సినిమా అంతా సాగుతుంది. ఈ స్పై యాక్షన్ సీక్వెల్ లో ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత జోష్ మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ప్రేక్షకులకు. సెకండ్ హాఫ్ లో ఎస్ జే సూర్య, యోగి బాబు ల మధ్య వచ్చే సన్నివేశాల్లో ప్రేక్షకులు కాస్త నవ్వుకుంటారు. మిగతా అంతా సినిమా స్లో గా ముందుకు కదులుతుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. అక్కడక్కడా యాక్షన్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. మొత్తం మీద చూస్తే సర్దార్ 2 మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలం అయింది.



