Telugu Gateway
Cinema

శర్వానంద్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లేనా?!

శర్వానంద్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చినట్లేనా?!
X

ఈ సంక్రాంతి సీజన్ లో చివరి సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ మూవీ బుధవారం సాయంత్రం విడుదల అయింది. ఉదయం నవీన్ పోలిశెట్టి నటించిన అనగనగ ఒక రాజు మూవీ ఉండటంతో ఓపెనింగ్స్ ఇంపాక్ట్ పడకుండా చేసుకోవటంతో పాటు థియేటర్ల సర్దుబాటు కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. శర్వానంద్ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణ ఫలితాన్ని చవిచూశాయి. దీంతో ఈ హీరో కూడా సంక్రాంతి బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. సామజవరగమనా వంటి హిలేరియస్ కామెడీ మూవీని తెరకెక్కించిన దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ నారీ నారీ నడుమ మురారిని తెరకెక్కించటంతో ఈ మూవీ పై కూడా అంచనాలు పెరిగాయి. టీజర్...ట్రైలర్ లు కూడా ఈ మూవీ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాయి. ఈ సినిమా కథ ఏంటి అంటే హీరో శర్వానంద్ కేరళలో ఆర్కిటెక్ట్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కానీ అక్కడి ఫుడ్ ఏ మాత్రం పడదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తనకు నచ్చిన ఫుడ్ దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో తన ఇంటి పక్కనే తెలుగు వంటకాల స్మెల్ పసిగడతారు. దీంతో ఆ ఫ్యామిలీ తో పులిహోర కలిపి తన తిండి సమస్యను పరిష్కరించుకున్నాడు.

తాను చేసే ఫుడ్ లో వాటా కావాలంటే తనకు మలయాళం నేర్పాలని షరతు పెడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయే సాక్షి వైద్య. ఇలా పులిహోర దగ్గర మొదలైన వీళ్ళ పరిచయం ఆలా ప్రేమగా మారుతుంది. తన కూతురు పదే పదే గౌతమ్ పేరు చూపుతుండటంతో అనుమానం వచ్చిన తండ్రి అతను స్నేహితుడా...ప్రేమికుడా అని అడుగుతాడు. తొలుత నో చెప్పినా తర్వాత వీళ్ళ ప్రేమకు ఓకే చెపుతాడు ఆమె తండ్రి. అయితే కాలేజీ లో ఉన్న సమయంలోనే శర్వానంద్ సంయుక్త మీనన్ తో ప్రేమలో పడతాడు. అంతే కాదు...ఏకంగా రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి కూడా చేసుకుంటారు. రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి అంటే కేవలం రెండు సంతకాలే...తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుందామని అనుకుని ఈ పని చేస్తారు. ఫైనల్ తాను కోరుకున్న అమ్మాయితో పెళ్ళికి అంతా ఒకే అయిన తర్వాత శర్వాకు వచ్చిన ఇబ్బందులు ఏమిటి...వీటిని ఎలా పరిష్కరించుకున్నాడు అన్నదే నారీ నారీ నడుమ మురారి మూవీ . ఈ సినిమాలో హై లైట్ అంటే శర్వానంద్ తండ్రిగా నటించిన నరేష్ రోలే. ఆయన తన యాక్షన్ తో సినిమాలో డామినేట్ చేశాడు.

ముఖ్యంగా నరేష్ తన కంటే వయస్సులో ఎంతో చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవటం...ఇది అంతా కూడా తన కొడుకే దగ్గరుండి ఇది నడిపించే వ్యవహారంతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. తర్వాత శర్వానంద్ పెళ్లి దగ్గర సాగే సంఘర్షణ కూడా సినిమాలో చాలా గ్రిప్పింగ్ గా చూపించాడు దర్శకుడు. ఒక తప్పు చేసి దాన్ని నుంచి తప్పించుకునేందుకు ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుంది అన్నది బాగా ప్రెజంట్ చేశాడు. ఈ సినిమాలో హీరో శర్వానంద్ కొత్త లుక్ లో కనిపించాడు. ఒక వైపు సరదాగా చేస్తూనే...మరో వైపు పెళ్లి సమయంలో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే సమయంలో సంఘర్షణ పడే యువకుడిగా బాగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించిన నరేష్, సంపత్ నంది తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిషోర్ ల కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయింది. మొత్తం మీద సంక్రాంతి బరిలో నిలిచిన శర్వానంద్ కు నారీ నారీ నడుమ మురారి సినిమా మంచి హిట్ ని అందించింది అనే చెప్పాలి. ముఖ్యంగా ఇది యూత్ కు...ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయ్యే మూవీ.

రేటింగ్ : 3 .25 /5


Next Story
Share it