Telugu Gateway
Cinema

మన శంకర వరప్రసాద్ గారు ఓటిటి డేట్ లాక్

మన శంకర వరప్రసాద్ గారు ఓటిటి డేట్ లాక్
X

దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వసూళ్ల విషయంలో ఈ సినిమా దుమ్మురేపింది. చిరంజీవి, వెంకటేష్, నయనతార లు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. థియేట్రికల్ రన్ దాదాపు పూర్తి కావటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్మురేపిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. జీ 5 లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు తో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ తదితర భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంటుంది అని జీ 5 అధికారికంగా వెల్లడించింది. మెగా విక్టరీ ఆఫ్ 2026 అంటూ ఒక లుక్ ను విడుదల చేసింది.

ఈ సినిమా ను దర్శకుడు అనిల్ రావిపూడి కథ కంటే కూడా చిరంజీవి వింటేజ్ లుక్స్ ...ఎంటర్టైన్ మెంట్ పోర్షన్స్ తో నే ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ లో వెంకటేష్ సెకండ్ హాఫ్ లో చేసే హంగామా కూడా ఆకట్టుకుంటుంది. మన శంకర వరప్రసాద్ గారు మూవీ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా కూడా రికార్డు నమోదు చేసింది. మరో వైపు ఈ సినిమా ఆల్ టైం రీజినల్ ఇండస్ట్రీ రికార్డు గా కూడా చిత్ర యూనిట్ చెపుతోంది. గత ఏడాది సంక్రాంతికి 300 కోట్ల రూపాయల వసూళ్లతో రికార్డు నమోదు చేసిన అనిల్ రావిపూడి ఈ ఏడాది సంకాంత్రికి కూడా అంత కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనే చెప్పాలి.

,

Next Story
Share it