Telugu Gateway
Cinema

నవీన్ పోలిశెట్టి హిట్ కొట్టాడా?!(Anaganaga Oka Raju Review)

నవీన్  పోలిశెట్టి హిట్ కొట్టాడా?!(Anaganaga Oka Raju Review)
X

సంక్రాంతి సినిమాల్లో అందరి దృష్టిని ఆకర్షించిన వాటిలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు మూవీ కూడా ఉంది. చాలా ముందు నుంచే హీరో నవీన్ పోలిశెట్టి తనదైన మార్క్ ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచాడు. దీనికి తోడు ఈ సినిమా పాటలు ...ట్రైలర్ కూడా సినిమాపై జోష్ ఎక్కడా తగ్గకుండా చేశాయి. కథపై నమ్మకంతోనే ఈ సంక్రాంతి బరిలో పెద్ద పెద్ద సినిమాలు ఉన్నా కూడా చిత్ర యూనిట్ సంక్రాతి కే ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి చిత్ర యూనిట్ అంచనాలు నిజం అయ్యాయి లేదో చూద్దాం.

ఈ సినిమా కథ ఏంటి అంటే హీరో నవీన్ పోలిశెట్టి ఒక జమీందారు కుటుంబంలో పుడతాడు. కానీ అప్పటికే అతని తాత ఉన్న ఆస్తులను అన్నిటిని పూర్తిగా ఖాళీ చేస్తాడు. పేరుకు రాజు గా హంగామా చేస్తాడు కానీ చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎలాగైనా మంచి డబ్బు ఉన్న అమ్మాయి ని పెళ్లి చేసుకుని రాజులాగా జీవితం గడపాలని ప్లాన్ చేస్తాడు. అందుకే పక్క ఊరిలో ఉండే మరో జమీందారీ కూతురు అయిన మీనాక్షి చౌదరి ని లవ్ లో దింపేందుకు తన స్నేహితులతో కలిసి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. అది విజయవంతం అయి వీళ్లిద్దరి పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత రాజుకు తెలిసిన అసలు విషయం ఏంటి...మరి రాజులాగా బతకాలనుకున్న తన కోరిక తీర్చుకునేందుకు హీరో ఏమి చేశాడు అన్నదే ఈ మూవీ.

ఒక్క మాటలో చెప్పలంటే ఈ సినిమా భారం మొత్తాన్ని హీరో నవీన్ పోలిశెట్టే మోశాడు . హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఆమె తన పాత్రకు న్యాయం చేసింది. తన కామెడీ టైమింగ్ తోనే నవీన్ పోలిశెట్టి ప్రేక్షకులకు దగ్గర అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి మరోసారి తన కామెడీ తో ప్రేక్షకులను బాగా నవ్వించాడు. నవీన్ పోలిశెట్టి, బుల్లి రాజు కాంబినేషన్ కూడా బాగా నవ్వులు పంచుతుంది. ముఖ్యంగా తన లవర్ గోవా వెళ్లాలనే కోరిక తీర్చేందుకు తాను ఉన్న చోటే గోవా బ్రాంచ్ ఏర్పాటు చేసిన తీరు సినిమాలో హై లైట్ గా ఉంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో రావు రమేశ్ ఆకట్టుకుంటాడు. ఇతర కీలక పాత్రల్లో చమ్మక్ చంద్ర, అనంత్, మహేష్ లు నటించారు. దర్శకుడు మారి తనకు మొదటి సినిమా అయినప్పటికీ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ‌ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా...సెకండ్ హాఫ్ లో ఎక్కువ భాగం కామెడీ నే డ్రైవ్ చేసినా కూడా క్లైమాక్స్ లో కథకు కొంత భావోద్వేగాలు కూడా జోడించారు. ఈ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే వర్క్ అవుట్ అయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో ఇది ఊహించని ట్విస్ట్ గా నిలుస్తుంది. ఓవర్ అల్ గా అనగనగ ఒక రాజు సినిమా తో సంక్రాంతికి వచ్చిన నవీన్ పోలిశెట్టి ఖాతాలో మరో హిట్ పడినట్లే లెక్క.

రేటింగ్: 3 /5

Next Story
Share it