Telugu Gateway
Cinema

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
X

సంక్రాంతి బరిలో నిలిచి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచిన మూవీ అనగనగ ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా జనవరి 14 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే కాదు హీరో నవీన్ పోలిశెట్టి నటించిన సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల వసూళ్ల మార్క్ ను సాధించిన తొలి సినిమా కూడా ఇదే. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను హీరో నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో నడిపించాడు. సినిమా ప్రమోషన్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా నవీన్ పోలిశెట్టి తన సినిమాకు హైప్ తెచ్చుకోవటంలో సక్సెస్ అయ్యాడు. అదే సమయంలో కంటెంట్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది.

ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి చేసే కామెడీ తో పాటు క్లైమాక్స్ లో వచ్చే ఊహించని ట్విస్ట్ కూడా సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన ఈ సినిమా ఓటిటి లో కూడా రికార్డు లు నమోదు చేయటం ఖాయం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండటంతో థియేటర్ లో చూడని వాళ్ళు అంతా కూడా ఓటిటి లో చూస్తారు అనే విషయం తెలిసిందే. ఈ మూవీ లో రావు రమేష్, చమ్మక్ చంద్ర, బుల్లి రాజు లు కూడా తమ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా టాలీవుడ్ లో వరస హిట్స్ తో దూసుకెళుతోంది. ఆమె గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు అనగనగ ఒక రాజు మూవీ లో మంచి పాత్రతో మరో హిట్ దక్కించుకుంది.

Next Story
Share it