Telugu Gateway
Cinema

తగ్గేదే లేదు అంటున్న రవి తేజ

తగ్గేదే లేదు అంటున్న రవి తేజ
X

వచ్చే సంక్రాంతి రేస్ లో నిలిచే సినిమాలు అన్ని ఇప్పటికే డేట్స్ లాక్ చేసుకున్నాయి. ఫస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా రాజాసాబ్ జనవరి 9 న వస్తుంటే..చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే అధికారికంగా ఈ డేట్ అనౌన్స్ చేశారు. నవీన్ పోలిశెట్టి సినిమా అనగనగ ఒక రాజు జనవరి పద్నాలుగున విడుదల అవుతుంటే...అదే రోజు సాయంత్రం శర్వానంద్ హీరో గా నటించిన నారీ నారీ నడుమ మురారి రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇన్ని సినిమా ల మధ్య రవితేజ హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా వస్తుందా..వాయిదా పడుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ రవితేజ ఏ మాత్రం తగ్గేది లేదు అంటూ జనవరి 13 వ తేదీని లాక్ చేసుకున్నారు.

చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఈ సినిమా టీజర్ ను విడుదల చేసి...రిలీజ్ డేట్ విషయంలో కూడా స్పష్టత ఇచ్చింది. కిషోర్ తిరుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాత గా ఉన్నారు. రవి తేజ సినిమా డేట్ కూడా అధికారికంగా ఫిక్స్ కావటంతో ఈ సంక్రాంతికి ఏకంగా ఐదు తెలుగు స్ట్రెయిట్ సినిమా లు బాక్స్ ఆఫీస్ వద్ద ఢీకొట్టుకోబోతున్నాయి. వీటికి తోడు డబ్బింగ్ సినిమా లు కూడా రేసులో ఉన్నాయి. మరి 2026 సంక్రాంతి రేస్ లో ఎవరు బాక్స్ ఆఫీస్ హీరోగా నిలుస్తారో చూడాలి. ఇక శుక్రవారం నాడు విడుదల అయిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా టీజర్ చూస్తే రవి తేజ స్టైల్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇది అంతా కూడా ఫన్నీ గా సాగుతుంది. మరి ఈ సినిమా తో అయినా రవితేజ హిట్ ట్రాక్ లోకి వస్తాడో లేదో చూడాలి.

Next Story
Share it