Telugu Gateway
Cinema

ఈ సంక్రాతి సినిమాల స్పెషల్ ఏంటో తెలుసా?!

ఈ సంక్రాతి సినిమాల స్పెషల్ ఏంటో తెలుసా?!
X

సంక్రాంత్రి అంటే తెలుగు వాళ్లకు రెండు పండుగలు ఒకటి అసలు పండగ అయితే ..రెండవది సినిమాల పండగ. తెలుగు లో ప్రతి సారి ఈ పండగ కోసం పెద్ద పెద్ద హీరోలు కూడా సినిమాలు ప్లాన్ చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే సందడి కొనసాగనుంది. ఇప్పటికే రెండు కీలక సినిమాలు తమ విడుదల తేదీలు ప్రకటించాయి. మరో సినిమా తేదీ ప్రకటన చేయాల్సి ఉంది. అఖండ సినిమా తో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాల కృష్ణ ఈ సారి వీరసింహరెడ్డి పేరుతో సంక్రాంత్రి కి సందడి చేయనున్నారు. ఈ సినిమా జనవరి 12 న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ శనివారంనాడు అధికారికంగా వెల్లడించింది. తమిళ హీరో విజయ్ నటిస్తున్న సినిమా వారసుడుగా తెలుగులో ఈ పండగకు రానుంది. ఈ సినిమా కూడా జనవరి 12 న వస్తోంది. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు అయితే దర్శకుడు వంశి పైడిపల్లి.

వాస్తవానికి వారిసు ఒరిజినల్ తమిళ సినిమా. కాకపోతే తెలుగు లోను విజయ్ కు మంచి మార్కెట్ ఉందనే విషయం అందరికి తెలుసు. పైగా నిర్మాత, దర్శకులు ఇద్దరు తెలుగు వాళ్ళు...ఈ సినిమా హీరోయిన్ తెలుగు లో ప్రస్తుతం మంచి రేంజ్ లో ఉన్న రష్మిక మందాన కావటం మరో ఆకర్షణ ఈ సినిమాకు. బాలకృష్ణ సినిమా లో హీరోయిన్ శృతిహాసన్ అయితే వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి హీరో గా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా కూడా ఈ సంక్రాత్రికే రానుంది. అయితే ఇంకా ఈ సినిమా డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇందులో చిరజీవి కి జోడిగా శృతిహాసన్ నటిస్తున్నారు. మరో హీరో రవితేజ ఇందులో కీలక పాత్రలో నటించారు. మరో కీలక విషయం ఏమిటి అంటే అటు బాలకృష్ణ సినిమా తో పాటు చిరంజీవి సినిమాను కూడా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్ కావటం ఇక్కడ మరో హైలైట్. రెండు సినిమాల్లో హీరోయిన్ శృతిహాసన్.

Next Story
Share it