Telugu Gateway
Cinema

వెరైటీ గా ఈవెనింగ్ రిలీజ్

వెరైటీ గా ఈవెనింగ్ రిలీజ్
X

టాలీవుడ్ లో చాలా మంది హీరో లకు కలిసి వచ్చిన సీజన్ సంక్రాంతి. అందుకే ఎక్కువ మంది ఈ సమయంలో తమ సినిమాలను విడుదల చేయాలని అనుకుంటారు. ఇందుకు ప్రధాన కారణం సంక్రాంతి పండగ సెలవులు అని కూడా చెప్పొచ్చు. ఏ మాత్రం కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇప్పుడు వచ్చే సంక్రాంతి రేస్ లో ఉన్న మరో సినిమా విడుదల తేదీ..టైం ను కూడా ప్రకటించింది. అదే శర్వానంద్ హీరో గా తెరకెక్కిన నారీ నారీ నడుమ మురారి సినిమా. ఈ సినిమా జనవరి 14 సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో శర్వానంద్ కు జోడిగా సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటించారు. ఏ కె ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీ ని నిర్మించింది. జనవరి 14 నే నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన అనగనగా ఒక రాజు మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఉదయం విడుదల అవుతుంటే...శర్వానంద్ మూవీ అదే రోజు సాయంత్రం విడుదల కానుంది. సంక్రాంతికి ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ లు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

Next Story
Share it