Telugu Gateway
Cinema

అసలు సిసలు పండగ సినిమా ఇదే (Sankranthiki Vasthunam Movei Review)

అసలు సిసలు పండగ సినిమా ఇదే (Sankranthiki Vasthunam Movei Review)
X

ఈ సంక్రాంతి సీజన్ లో చివరి సినిమాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం పండగ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత సినిమాలకు భిన్నంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రకరకాల మార్గాలు ఎంచుకుని సినిమాపై హైప్ పెంచటంలో సక్సెస్ అయ్యారు. అనిల్ రావిపూడి సినిమాలు అంటే ఎక్కువ శాతం ఫుల్ ఫన్ టార్గెట్ గానే తెరకెక్కుతాయి. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా లైన్ విషయం అర్ధం అయింది. ఒక సింపుల్ కథతో దర్శకుడు అనిల్ రావిపూడి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేయటంతో పాటు ...ఫుల్ ఎంగేజ్ చేశారు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో . గత కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు అనిల్ రావిపూడి సంక్రాంతి సందర్భంగా మరో సూపర్ హిట్ మూవీ ఇచ్చాడు అనే చెప్పాలి.

ఇక సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే విదేశాల్లో ఒక పేరుగాంచిన దిగ్గజ ఐటి కంపెనీ అధినేత ఇండియా కి వస్తుండటంతో ఎలాగైనా ఆయన్ను ఫస్ట్ తెలంగాణ కు రప్పించి ..తద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రకటన చేయించుకోవాలని చూస్తారు. కానీ ఫార్మ్ హౌస్ లో పార్టీకి వెళ్లిన ఆ కంపెనీ అధినేతను ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. జైలు లో ఉన్న ఒక కరుడుగట్టిన నేరస్తుడిని విడుదల చేస్తే తప్ప ఈ ఐ టి కంపెనీ అధినేతను విడిచిపెట్టబోమని ఆ గ్యాంగ్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తుంది. తెలంగాణ సీఎం పాత్రలో నరేష్, ఐటి కంపెనీ అధినేతగా అవసరాల శ్రీనివాస్ కనిపిస్తారు. చివరకు ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసిన ఐటి అధినేత ను వెనక్కి తెచ్చే బాధ్యతను సస్పెండ్ అయిన అధికారి వెంకటేష్ కు అప్పగిస్తారు. ఈ సింపుల్ స్టోరీ లైన్ ను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సూపర్ సక్సెస్ అయ్యారు.

వెంకటేష్ తో పాటు ఆయనకు జోడిగా నటించిన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి లు మంచి నటన చూపించారు. ఫస్ట్ హాఫ్ సినిమా ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో మూవీ సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో అప్పుడపుడు స్లో అవుతుంది అన్న ఫీలింగ్ కలిగిన ప్రతిసారి మళ్ళీ జోష్ ఏ మాత్రం తగ్గకుండా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ లో హై లైట్ పాత్ర అంటే బుల్లిరాజు దే. సినిమా చూస్తే తప్ప ...దీని గురించి చెప్పటం సాధ్యం కాదు అనే చెప్పొచ్చు. అంతగా ప్రేక్షకులను నవ్వించాడు బుల్లి రాజు. వెంకటేష్ తో పాటు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి కూడా మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రలు దక్కాయి. మీనాక్షి చౌదరి తో పోలిస్తే ఐశ్వర్య రాజేష్ పాత్ర హై లైట్ గా నిలుస్తుంది. వెంకటేష్ తనకు అలవాటు అయిన పాత్రతో ఈ సినిమా లో మరో సారి దుమ్మురేపాడు . ఈ సినిమాలో సాయి కుమార్ తో పాటు వి టివి గణేష్, ఉపేంద్ర లిమాయే లు కీలక పాత్రలు పోషించారు.. తమ వంతుగా ప్రేక్షకులను నవ్వించారు. మొత్తం మీద సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీగా నిలుస్తుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

రేటింగ్ : 3 .5 - 5

Next Story
Share it