నెట్ ఫ్లిక్స్ లో సందీప్ కిషన్ కొత్త సినిమా

సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన మూవీ సిగ్మా. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం సినిమా దర్శకుడే. ఒకప్పటి హీరో..ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ఇదే కావటంతో అటు పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన సిగ్మా మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ఈ సినిమాను ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.



