Telugu Gateway
Cinema

బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత హవా

బాక్స్ ఆఫీస్ దగ్గర  సమంత హవా
X

సమంత కీలక పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. మా ఇంటి బంగారం మూవీ విషయంలో కొంత మంది పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేసినా కూడా ఈ సినిమా కలెక్షన్స్ పై అవేమి పెద్దగా ప్రభావం చూపించలేకపోయానే చెప్పాలి. ఈ సినిమాలో సమంత నటన హై లైట్ గా నిలిచింది. ఓ బేబీ మూవీ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇదే కావటంతో మొదటి నుంచి ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.

అయితే విడుదల అయిన తర్వాత మిశ్రమ స్పందనలు వ్యక్తం అయినా కూడా కలెక్టన్స్ పరంగా చూస్తే ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలిచినట్లే అని చెప్పాలి. జూన్ 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనాన్ని నమోదు చేసింది. పాజిటివ్ మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ విషయంలో కీలక పాత్ర పోషిస్తోంది అని చెప్పాలి. టాలీవుడ్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ కి కేవలం నాలుగు రోజుల్లో ఏకంగా 50 కోట్ల రూపాయల వసూళ్లు రావటం కీలక పరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు ఈ సినిమా పట్ల ఆకర్షితులు అవుతున్నారు.

Next Story
Share it