Telugu Gateway
Cinema

బిగ్ బాస్ లోకి సమంత ఎంట్రీ

బిగ్ బాస్ లోకి సమంత ఎంట్రీ
X

ఈ ఎంట్రీ బిగ్ బాస్ హౌస్ లోకి కాదు. హోస్ట్ పాత్రలోకి. వారం వారం శని, ఆదివారాల్లో నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున బాధ్యతను ఆయన కోడలు, హీరోయిన్ సమంత తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ల షూటింగ్ ఇప్పటికే మొదలైంది. రెండు, మూడు వారాల పాటు సమంతనే ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు చూడనున్నారు. మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది నాగార్జున, సమంతల మధ్య పోటీలాంటిదే. ఎవరు హోస్ట్ గా వ్యవహరించిన సమయంలో బిగ్ బాస్ కు రేటింగ్స్ ఎక్కువ వస్తాయనేది ఇప్పుడు కీలకం కానుంది. నిజంగా సమంతకు కూడా ఇది ఛాలెంజింగ్ వ్యవహారంగా మారనుంది.

నాగార్జున అంటే గతంలో ఓ సారి బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఇది ఆయనకు రెండవసారి. మరి సమంత ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తుంది అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారుతుంది. నటన పరంగా సమంత ఎంతో మెరుగైనా బిగ్ బాస్ వంటి కార్యక్రమాన్ని ఆమె ఎలా డీల్ చేస్తారు.సహజంగానే నాగార్జున బాగా చేశారా లేక సమంత ఇంకా బాగా చేశారా అన్న పోలిక రావటం సహజం. దీంతో ఇది సమంతకు కూడా పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ గా మారనుంది. దీంతో పాటు రేటింగ్స్ కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. నాగార్జున ప్రస్తుతం మనాలిలో వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన 21 రోజులు అక్కడే ఉండబోతున్నారు. అంటే అప్పటివరకూ బిగ్ బాస్ తెలుగు హోస్ట్ సమంతనే అన్న మాట.

Next Story
Share it