నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదంటున్న సమంత
హలో..అదాబ్ అందరికీ నమస్కారం..నేను మీ నాగార్జున ..కాకపోతే ఈ డైలాగ్ చెప్పింది నాగార్జున కాదు. సమంత. ఈ రోజు నాతో ఎంజాయ్ మెంట్ మామూలుగా ఉండదు అంటోంది సమంత. ఆదివారం నాటి బిగ్ బాస్ షోపై ఆమె అంచనాలు పెంచేసింది సమంత. అంతే కాదు..సహజంగా జరిగే షో టైమ్ కంటే బిన్నంగా ఈ సారి ఏకంగా సాయంత్ర ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ అంటే మూడు గంటల పాటు దసరా స్పెషల్ బిగ్ బాస్ షో సాగనుంది. సహజంగా వారాంతాల్లో తొమ్మిది గంటలకు ప్రారంభమై పదిన్నర వరకూ సాగుతుంది. అయితే సమంత ప్రత్యేక ఆకర్షణగా బిగ్ బాస్ షో హోస్ట్ గా రానుండటంతో సహజంగానే ఈ షోపై మరింత ఆసక్తి పెరిగింది.
ఒక రకంగా చెప్పాలంటే సమంతకు కూడా ఇది ఓ ఛాలెంజింగ్ టాస్క్ కిందే లెక్క. నాగార్జున శనివారం నాటి బిగ్ బాస్ షో కు కూడా డుమ్మా కొట్టారు. కాకపోతే మనాలీలో తాను పాల్గొంటున్న షూటింగ్ స్పాట్ నుంచి సందేశంతో షో స్టార్ట్ చేశారు. శనివారం నాటి షో అంతా 'ప్రేమ మొదలైంది' సినిమా తో సందడి సందడిగా సాగిపోయింది. ఇందులో తొలుత వచ్చిన అవినాష్, అరియానాలు చేసిన పల్లెటూరి అబ్బాయి...సిటీ అమ్మాయి ల పాత్రల్లో అదరగొట్టారు. తర్వాత మొహబూబ్, అరియానాల బలవంతపు లవ్ ప్రపొజల్ వ్యవహారం నిజమైన సినిమాలో సీన్లను తలపించింది. చివరకు అరియానా, అవినాష్ ల ప్రేమ కథ సుఖాంతం అవుతుంది.