సమంతకు 7944 చదరపు అడుగుల డూప్లెక్స్ అపార్ట్ మెంట్

సెలబ్రిటీలు ఏమి చేసిన వార్తే. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. హీరో కొత్త కారు కొన్నా...కొత్త ఇల్లు కొన్నా వాళ్ళ కంటే ఫ్యాన్సే ఎక్కువగా వీటికి ప్రచారం కల్పిస్తుంటారు. హీరోయిన్ల విషయంలోనూ అంతే. ఇప్పుడు అందుకే ఒక వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అదేంటి అంటే ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తాజాగా 7.8 కోట్ల రూపాయలు పెట్టి హైదరాబాద్ లో ఒక డూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. జయభేరి ఆరంజ్ కౌంటీ లో ఆమె మొత్తం 7944 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉండే ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. దీనికి ఆరు కారు పార్కింగ్ స్లాట్స్ వస్తాయి. ఈ ఫ్లాట్ కు సంబంధించి సమంత కు 13 వ అంతస్థులో 3920 చదరపు అడుగులు, 14 వ అంతస్థులో 4024 చదరపు అడుగుల స్పేస్ వస్తుంది.
ఈ విషయాన్నీ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. అంతకు ముందు సమంత ముంబై లో కూడా 15 కోట్ల రూపాయలతో రాజభవనం లాంటి అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు. రష్మిక మందాన తొలుత ముంబైలో విలాసవంత మైన ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత సమంత కూడా అదే బాటలో పయనించారు. సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూసింది. అంతకు ముందు ఆమె నటించిన యశోద సినిమా కొంతలో కొంత మెరుగ్గా ఆడింది అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు లో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.