Telugu Gateway
Cinema

ఒక్క వారంలోనే 'ఎలిమినేట్ ' అయిన సమంత!

ఒక్క వారంలోనే ఎలిమినేట్  అయిన సమంత!
X

అదేంటి. సమంత ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఉందా? ఎలిమినేట్ అవటానికి అన్నదే కదా మీ డౌట్. నిజమే. వాస్తవానికి అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్ ' సినిమా కోసం 21 రోజులు కులుమనాలీలో ఉంటానని ఓ వీడియోలో చెప్పాడు. అంటే మూడు వారాలు. ఈ మూడు వారాలు కూడా సమంతనే బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తుందని అందరూ భావించారు. అంతే కాదు చాలా మంది వెబ్ మీడియాలో అయితే సమంత రెమ్యునరేషన్ అంత తీసుకోనుంది..ఇంత తీసుకోనుంది..నాగార్జున కంటే ఎక్కువే అంటూ వార్తలు వండి వార్చారు. సీన్ కట్ చేస్తే సమంత దసరా స్పెషల్ ఎపిసోడ్ తో బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పేసింది. 21 రోజుల షూటింగ్ అన్న నాగార్జున ప్రత్యేక విమానంలో బిగ్ బాస్ కోసం వెనక్కి వచ్చినట్లు ప్రొమో వీడియోల్లో కన్పిస్తోంది.

దీంతో సమంత ఒక్క వారానికి వెళ్ళిపోయింది. సమంత ఇన్ స్టాగ్రామ్ లో దీనికి సంబంధించి ఓ పోస్ట్ కూడా పెట్టింది. ఇప్పటివరకూ ఇలాంటి షోలు చేయకపోవటం వల్ల తనకు కొంత భయం ఉందని..దీనికి తోడు తెలుగు అంత అలవోకగా మాట్లాడే ఛాన్స్ లేకపోవటం వంటి వాటి వల్ల ఇబ్బందిపడినట్లు తెలిపింది. అయితే తనకు ఈ ఛాన్స్ ఇచ్చిన మామ నాగార్జునకు థ్యాంక్స్ చెప్పింది సమంత. అంతే కాదు బిగ్ బాస్ షోను తాను ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చూడలేదని బాంబు పేల్చింది. మళ్ళీ ఎప్పటిలాగానే ఈ శనివారం, ఆదివారం బిగ్ బాస్ షోల్లో నాగార్జుననే ఆలరించనున్నారు. సమంత దసరా రోజు టెలికాస్ట్ అయిన షోను చాలా వరకూ ఓకే అన్పించేలా చేసినా ఆమె తాజా సినిమాలు ఓ బేబీ వంటి వాటితో పోలిస్తే ఈజ్ మిస్ అయిందనే విషయం స్పష్టం అయింది.

Next Story
Share it