Telugu Gateway
Cinema

స‌మంత‌కు కోర్టులో ఊర‌ట‌

స‌మంత‌కు కోర్టులో ఊర‌ట‌
X

యూట్యూబ్ లో త‌న‌పై ఇష్టానుసారం అస‌త్య క‌థ‌నాలు ప్ర‌సారం చేసిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హీరోయిన్ స‌మంత వేసిన పిటీష‌న్ పై మంగ‌ళ‌వారం నాడు తీర్పు వెలువ‌డింది. ఈ తీర్పులో స‌మంత‌కు ఊర‌ట ద‌క్కింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని, యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్ ఉన్న లింక్ ల‌ను తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా తొలగించాలని పేర్కొంది. అదే స‌మ‌యంలో స‌మంత కూడా త‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టొద్ద‌ని సూచించింది.

సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ సమంత కూకట్‌పల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత జీవితంపై లేనిపోని అబద్ధాలు చెబతూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ సమంత పిటిషన్‌లో పేర్కొంది. స‌మంత‌, నాగ‌చైత‌న్య‌ల విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఈ ప్ర‌సారాలు చోటుచేసుకున్నాయి.

Next Story
Share it