'తగ్గేదేలా' అంటున్న సమంత
పుష్ప సినిమాతో సమంత పేరు మరోసారి మారుమోగిపోతుంది. ఓ వైపు విమర్శలు..మరోవైపు డ్యాన్స్ బాగా చేసిందంటూ ప్రశంసలు. అయితే ముఖ్యంగా సమంత నర్తించిన పాటపై మాత్రం ఇంకా దుమారం సాగుతూనే ఉంది. చిత్ర యూనిట్ దీనిపై పలు వివరణలు ఇచ్చుకుంది. అయినా ఈ వివాదం సాగుతూనే ఉంది. అయితే ఈ వివాదాన్ని సమంత పెద్ద సీరియస్ గా తీసుకన్నట్లు కన్పించటం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ అంశాన్ని చాలా లైట్ గా తీసుకుని తన అభిప్రాయాలను వెల్లడించింది. సమంత వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే..'పుష్పలో నేను భాగమైనందకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్పెషల్ సాంగ్ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాటలో డ్యాన్స్, బన్నీకి సమానంగా స్టేప్పులు వేయడం ఇలా ప్రతిదీ చాలా ఎక్జయిటింగ్‌గా అనిపించింది. ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్, ఆడియన్స స్పందన చ్తూస్తుంటే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది.
ఇది ఓ మ్యాడ్‌నెస్' అంటూ వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో ఈ పాటపై వస్తున్న ఫన్నీ వీడియోస్‌పై సమంత తన ట్విట్టర్ వేదికగా స్పందించింది. కొందరు యువకులు ఈ పాటను షార్ట్ వీడియోగా తీసి ఎగ్జామ్స్ ఉన్నాయ్ కదరా.. అంటే ఎగ్జామ్‌లో కూడా ఊ అంటావా.. ఊహు అంటావా మావా అనే పాట రాస్తానేమోనని భయంగా ఉందిరా అంటూ పేర్కొన్నాడు. ఈ వీడియోను సమంత నవ్వుతున్న ఎమోజీలను జత చేసి రీట్వీట్ చేసింది. ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పురుషుల సంఘంతో పాటు తమినాడు పురుషు సంఘం కూడా కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.