Telugu Gateway
Cinema

గాడ్ ఫాద‌ర్ సెట్ లోకి సల్మాన్ ఖాన్

గాడ్ ఫాద‌ర్ సెట్ లోకి సల్మాన్ ఖాన్
X

ప్ర‌ముఖ బాలీవుడ్ హీరో స‌ల్మాన్ ఖాన్ తొలిసారి చిరంజీవితో క‌ల‌సి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమాలో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మ‌ళ‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ కు ఇది రీమేక్ అన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షెడ్యూల్ ముంబ‌య్ లో జ‌రుగుతోంది. స‌ల్మాన్ కు స్వాగ‌తం ప‌లుకుతున్న ఫోటోను చిరంజీవి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాకుండా 'మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది.

ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అంటూ ట్వీట్ చేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న‌ది హీరో రామ్ చ‌ర‌ణే. కొణిదెల ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

Next Story
Share it