Telugu Gateway
Cinema

దుమ్మురేపుతున్న సలార్ టీజర్

దుమ్మురేపుతున్న సలార్ టీజర్
X

ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. సలార్ టీజర్ చూసిన తర్వాత సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఏ సినిమాలో అయినా ఎవరో ఒక ప్రముఖ వ్యక్తితో కథ చెప్పించే ప్రయత్నం చేస్తారు అనే విషయం తేలిపోయింది. కెజీఎఫ్ రెండు భాగాల్లోనూ అయన ఇదే ట్రెండ్ కొనసాగించారు. ఇప్పుడు సలార్ టీజర్ చూస్తే ఇందులో కూడా అదే ట్రెండ్ ఫాలో అయినట్లు కనిపిస్తోంది. సింపుల్ ఇంగ్లీష్. నో కన్ఫ్యూషన్. సింహం, చిరుత, పులి, ఏనుగు చాలా ప్రమాదకరం. కానీ జురాసిక్ పార్క్ లో కాదు. ఎందుకంటే అక్కడ..అంటూ టినూ ఆనంద్ చెప్పే డైలాగు తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎక్కడా హీరో ప్రభాస్ పేస్ చూపించకుండానే 1 .46 నిమిషాల టీజర్ విడుదల చేశారు.

ఇందులో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాలా ఉంది. ఇప్పుడు సలార్ సౌండ్ కు యూట్యూబ్ దద్దరిల్లి పోతుంది. టీజర్ ద్వారా కీలక విషయాన్నీ వెల్లడించింది చిత్ర యూనిట్. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. సెప్టెంబర్ 28 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటిస్తోంది. చూస్తుంటే సలార్ సినిమా లోనూ ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉండేలా కనిపిస్తున్నాయి. టీజర్ విడుదల అయినా తొమ్మిది గంటల్లోనే ఏకంగా రెండున్నర కోట్ల వ్యూస్ తో దుమ్మురేపుతోంది. 24 గంటలు పూర్తి అయ్యేనాటికి ఈ రికార్డుల మోత మరింత పెరగటం ఖాయం అని చెప్పొచ్చు.

Next Story
Share it