Telugu Gateway
Cinema

ప్రచారమే నిజం

ప్రచారమే నిజం
X

ఇది అధికారికం. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ బుధవారం నాడు సాలార్ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సి ఉంది. సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటినుంచే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుంది అని ప్రచారం ఉంది.

ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా వాయిదా నిర్ణయం వెల్లడించి..త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపింది. అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా వేయాల్సి వచ్చింది...అని ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభవం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. సాలార్ పై మీరు చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ..వాయిదా ను సహృదయంతో అర్ధం చేసుకోవాలని కోరింది. ఈ సినిమా లో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it