Telugu Gateway
Cinema

సలార్ సాధించాడు

సలార్ సాధించాడు
X

ప్రపంచ వ్యాప్తంగా సలార్ సినిమా వసూళ్లు ఐదు వందల కోట్ల రూపాయలను అధిగమించాయి. ఈ ఏడాది కేవలం ఆరు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ సాధించిన సినిమాగా సలార్ నిలిచింది. విజయ్ లియో, రజనీకాంత్ జైలర్, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలను వెనక్కి నెట్టి సలార్ వేగంగా ఈ రికార్డు ను అందుకుంది.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో ప్రభాస్, పృద్విరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ముందు నుంచి కూడా ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ పై ప్రభాస్ ఫాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. వారి అంచనాలకు తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాలతో ప్రభాస్ ఆకట్టుకున్నాడు. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఈ పాన్ ఇండియా హీరో కి మంచి హిట్ దక్కినట్లు అయింది.

ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు సలార్ ఘన విజయంతో అటు ప్రభాస్ ...ప్రభాస్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి ఏడి 2898 సినిమాలో నటిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. సలార్ పార్ట్ టూ శౌర్యంగ పర్వము విడుదల 2025 లో ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ప్రభాస్ సంచలన దర్శకుడు వంగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ మూవీ లో కూడా నటించనున్నారు.

Next Story
Share it