Telugu Gateway
Cinema

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా విడుదల కొత్త తేదీ వచ్చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ శనివారమే నాడు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వాయిదా పడ్డ ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సినిమా కావటంతో దీనిపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఈ సెప్టెంబర్ 28 న విడుదల కావాల్సి ఉంది.

కానీ సిజీ వర్క్స్ పూర్తి కాకపోవటంతో విడుదలను వాయిదా వేశారు. ప్రేక్షకులకు ప్రపంచ శ్రేణి సినిమాటిక్ ఎక్సపీరియన్సు ఇవ్వటానికే జాప్యం జరిగింది అని ప్రకటించారు. ఇప్పుడు కొత్త తేదీ రావటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఈ వార్తను షేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతి హాసన్ నటించింది. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే చిత్ర యూనిట్ అధికారికంగా చెప్పక ముందే డిసెంబర్ 22 వ తేదీ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇప్పుడు చిత్ర యూనిట్ కూడా అధికారికంగా అదే తేదీని వెల్లడించింది.

Next Story
Share it