Telugu Gateway
Cinema

సలార్ తొలి రోజు వసూళ్లు 175 కోట్లు

సలార్ తొలి రోజు వసూళ్లు 175 కోట్లు
X

సలార్ సినిమా తొలి రోజు వసూళ్లు దుమ్మురేపాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, పృద్విరాజ్ సుకుమారన్ లు కీలక పాత్రలు పోషించారు. కెజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ సినిమా కావటంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా 175 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాగా..ఒక్క భారత్ లోనే 95 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. సలార్ పై ఉన్న హైప్...వరస సెలవుల కారణంగా ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ ను అధిగమిస్తుంది అని భావిస్తున్నారు.

ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలకు మాత్రం థియేటర్లు దద్దరిల్లాయి...ప్రభాస్ ఫాన్స్ అయితే మళ్ళీ పాత ప్రభాస్ ను చూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు భారత్ లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా 75 కోట్ల రూపాయలతో షారుఖ్ ఖాన్ జవాన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమాను ప్రభాస్ సలార్ బీట్ చేసింది. అయితే తొలి రోజు 95 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ప్రభాస్ సినిమా ఆ రికార్డు ను తిరగరాసింది.

Next Story
Share it