Telugu Gateway
Cinema

శాకుంతలం ఫట్...సమంత స్పందన ఇది!

శాకుంతలం ఫట్...సమంత స్పందన ఇది!
X

భారీ అంచనాల మధ్య విడుదల అయిన శాకుంతలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లో పది కోట్ల రూపాయలు కూడా వసూలు చేయ లేక పోయింది అని టాలీవుడ్ టాక్. సినిమా ఫలితం దారుణంగా ఉండటం తో చిత్ర యూనిట్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్స్ సాగుతున్నాయి. శాకుంతలం సినిమా లో సమంత అనారోగ్య ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. ఈ సమస్యకు ముందు కనిపించిన సమంత...శాకుంతలంలో సమంత కు మధ్య తేడా చాలా స్పష్టంగా గుర్తించవచ్చు. ఇది ఒక కారణం అయితే ఎక్కువ మందికి తెలిసిన ఈ కథను ప్రేక్షకులను ఆకట్టుకునేలా మల్చటంలో దర్శకుడు గుణ శేఖర్ విఫలం అయ్యారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సినిమాకు రివ్యూ లు అన్ని కూడా ప్రతికూలంగా వచ్చాయి. ఒక్క అల్లు అర్హ పాత్ర తప్ప సినిమాలో పాజిటివ్ అంశాలు ఏమి లేవు అంటూ అందరూ శాకుంతలం సినిమాపై కామెంట్స్ చేశారు.

టాలీవుడ్ లో సమంత స్టార్ హీరోయిన్ హోదా ఇక గతమే అంటూ ఒకప్పటి నిర్మాత, విమర్శకుడు చిట్టి బాబు కామెంట్ చేశారు. దీంత పాటు అయన తన సినిమా ల పబ్లిసిటీ కోసం సమంత చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై కూడా సమంత ఫాన్స్ మండిపడుతున్నారు. తాజాగా శాకుంతలం పరాజయంపై సమంత కూడా పరోక్షంగా స్పందించారు. ఆమె ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. పని చేయటం వరకే నీకు అధికారం. ఫలం తో నీకు సంబంధం లేదు. అందుకే ప్రతిఫలం ఆశించి ఏ పని చేయకు. అలా అని పని చేయటం మానకు అంటూ భగవద్గీత లోని శ్లోకాన్ని రాశారు. విజయాలు, అపజయాలు వస్తుంటాయని...కానీ మన పని మనం చేయాలి అంటూ స్పందించారు. ప్రస్తుతం సమంత విజయదేవరకొండ తో కలిసి ఖుషి సినిమా తో పాటు సిటాడెల్ భారతీయ వెర్షన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఇది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్.

Next Story
Share it