సాయిధరమ్ తేజ్ డిశ్చార్జ్
BY Admin15 Oct 2021 8:29 AM GMT
X
Admin15 Oct 2021 8:29 AM GMT
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇవాళ సాయిధరమ్ తేజ్ పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి ట్వీట్ చేశారు. 'విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్ తేజ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ' అని పేర్కొన్నారు. గత నెలలో సాయి తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా సాయి 35 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.
Next Story