Telugu Gateway
Cinema

'లవ్ స్టోరీ' సినిమా విడుదల వాయిదా

లవ్ స్టోరీ సినిమా విడుదల వాయిదా
X

సారంగదరియా పాటతో 'లవ్ స్టోరీ' సినిమాపై ఒక్కసారిగా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ పాటలో హీరోయిన్ సాయిపల్లవి డ్యాన్స్ కూడా దుమ్మురేపటంతో యూట్యూబ్ లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముందు ప్రకటించిన తేదీ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సి ఉంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్న ఈ తరుణంలో సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకుంది.

అయితే కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర నిర్మాత నారాయణ్ దాస్ నారంగ్ వెల్లడించారు. చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ అంతా రెడీ అయిన తర్వాత సినిమా విడుదల వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. సినిమా ఎంతో బాగా వచ్చిందని..తనకు శేఖర్ కమ్ముల మంచి సినిమా ఇచ్చారని హీరో నాగచైతన్య తెలిపారు. కుటంబం అంతా కలసి చూడాల్సిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని దర్శకుడు శేఖర్ కమ్ముల వెల్లడించారు.

Next Story
Share it