Telugu Gateway
Cinema

ఎన్టీఆర్, బన్నీ, చరణ్ నాతో ఒక పాట చేయాలి

ఎన్టీఆర్, బన్నీ, చరణ్ నాతో ఒక పాట చేయాలి
X

సాయి పల్లవి. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది అని చెప్పొచ్చు. నటనే కాదు...డాన్స్ లో సాయి పల్లవి ని అందుకోవటం ఒకింత కష్టమైన వ్యవహారమే. చాలామంది తెలుగు హీరోలు సాయి పల్లవి తో కలిసి డాన్స్ చేయాలంటే చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. విరాటపర్వము సినిమా తర్వాత మళ్ళీ తెలుగు లో సాయి పల్లవి కొత్త సినిమా అంగీకరించినట్లు సమాచారం లేదు. ఆమె తాజాగా స్మిత నిర్వహిస్తున్న షో నిజం లో పాల్గొన్నారు. సాయి పల్లవి డాన్స్ కు ప్రత్యేకత ఉంది. ఆమె స్పీడ్ చాలా ఎక్కువ. అలాగే టాలీవుడ్ హీరోల్లో డాన్స్ లో దుమ్ము రేపే హీరోల్లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ లు ముందు వరసలో ఉంటారు అన్న విషయం తెలిసిందే.

ఇదే కారణం తో స్మిత మీరు తెలుగు లో ‘నేను ఇంకో స్టార్ తో డాన్స్ చేయాలి అంటే ఎన్టీఆర్ ..బన్నీ, రామ్ చరణ్..అని ప్రశ్నిస్తే.....ముగ్గురూ నాతో ఒక పాటకు డాన్స్ చేయాలి అంటూ తనదైన స్టైల్ రిప్లై ఇచ్చారు’ సాయి పల్లవి. ఇదే షో లో ఆమె మీ టూ అంశంపై కూడా స్పందించారు. మహిళల వేధింపులు అంటే అది శారీరకంగానే ఉండాల్సిన అవసరం లేదు అని...మాటలతో..ఇబ్బంది కలిగించేలా చేసిన అవి కూడా వేధింపుల కిందే వస్తాయని వ్యాఖ్యానించారు. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి పుష్ప 2 సినిమా లో ఒక కీలక పాత్ర చేయబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంత వరకు లేదు.

Next Story
Share it