Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' జ‌న‌నీ సాంగ్ విడుద‌ల‌

ఆర్ఆర్ఆర్ జ‌న‌నీ సాంగ్ విడుద‌ల‌
X

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి అత్యంత కీల‌క‌మైన 'జ‌న‌నీ' సాంగ్ విడుద‌లైంది. ఈ పాట సినిమాకు ఆత్మ వంటిది అని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఎం ఎం కీర‌వాణి స్వ‌ర‌ప‌రిచిన ఈ భావోద్వేగ పాట ను ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగానే శుక్ర‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు న‌టించిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇక నుంచి ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్ వేగాన్ని పెంచ‌నున్నారు. దీని కోసం ప‌లు కార్య‌క్ర‌మాల‌కు చిత్ర యూనిట్ ప్ర‌ణాళికలు సిద్ధం చేసింది.

Next Story
Share it