Telugu Gateway
Cinema

రెండు తేదీల‌తో 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల ప్ర‌క‌ట‌న‌

రెండు తేదీల‌తో ఆర్ఆర్ఆర్ విడుద‌ల ప్ర‌క‌ట‌న‌
X

ఆర్ఆర్ఆర్ టీమ్ శుక్ర‌వారం నాడు ఓ విచిత్ర ప్ర‌క‌ట‌న చేసింది. ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి రెండు ఆప్ష‌న్స్ పెట్టుకుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఈ సినిమా వాయిదా ప‌డ‌టంతో అటు ఎన్టీఆర్, ఆటు రామ్ చ‌ర‌ణ్ అభిమానుల్లో తీవ్ర అస‌హ‌నం నెల‌కొంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టంతో ప‌లు రాష్ట్రాల్లో రాత్రి క‌ర్ఫ్యూల‌తోపాటు ప‌లు ఆంక్షలు అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అందుకే ఇప్పుడు డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితి కుదుట‌ప‌డి..ప‌రిస్థితి సాధార‌ణ స్థితికి వస్తే..థియేట‌ర్లు పూర్తి స్థాయి సామ‌ర్ధ్యంతో అనుమ‌తిస్తే తాము మార్చి 18న సినిమా విడుద‌ల చేయ‌టానికి సిద్ధంగా ఉన్నామ‌ని..లేదంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఏప్రిల్ 28న విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించారు. బ‌హుశా దేశ చ‌రిత్ర‌లోనే ఇలా రెండు తేదీల‌తో సినిమా విడుద‌ల ప్ర‌క‌టించిన చ‌రిత్ర కూడా ఆర్ఆర్ఆర్ దే అయి ఉండొచ్చు. వాస్త‌వానికి ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సి ఉన్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it