Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌ల‌ వాయిదా

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల‌ వాయిదా
X

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న్ సినిమా ఆర్ఆర్ఆర్. వాస్త‌వానికి ఈ సినిమా ట్రైల‌ర్ గురువారం అంటే డిసెంబ‌ర్ 3న విడుద‌ల కావాల్సి ఉంది. ఈ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. అయితే ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి అక‌స్మిక మ‌ర‌ణంతోపాటు మ‌రికొన్ని కార‌ణాల వ‌ల్ల ట్రైల‌ర్ విడుద‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. త‌దుప‌రి విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది.

ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. సీతారామ‌శాస్త్రి ఈ సినిమా కోసం దోస్తీ పాట‌ను అందించారు. ఈ పాట‌లో సీతారామ‌శాస్త్రి సిగ్నేచర్ షాట్ తీసుకుందామ‌నుకున్నామ‌ని..కానీ అప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉండ‌టంతో ఈ ప్ర‌య‌త్నం విరమించుకున్న‌ట్లు తాజాగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it