Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' ట్రైల‌ర్ విడుద‌ల డిసెంబ‌ర్ 9న‌

ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల డిసెంబ‌ర్ 9న‌
X

ప్ర‌తిష్టాత్మ‌క సినిమా ఆర్ఆర్ఆర్ ట్రైల‌ర్ విడుద‌ల‌కు ముహుర్తం ఫిక్స్ అయింది. వాస్త‌వానికి డిసెంబ‌ర్ 3నే విడుద‌ల కావాల్సిన ఈ ట్రైల‌ర్ ను ప్ర‌ముఖ గేయ‌ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మ‌ర‌ణంతోపాటు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశారు. శ‌నివారం నాడు కొత్త తేదీతో న్యూలుక్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేయటంతోపాటు అదే రోజు థియేట‌ర్ల‌లో కూడా దీన్ని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 450 కోట్ల రూపాయ‌ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొని ఉంది.

తాజాగా విడుద‌లైన అఖండ సినిమాకు ప్రేక్షకులు భారీ సంఖ్య‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చినందున ఇక అస‌లు త‌మ సినిమాకు ఏ మాత్రం ఢోకా ఉండ‌ద‌ని ఆర్ఆర్ఆర్ టీమ్ ధీమాగా ఉంది. అందులో ఇద్ద‌రు అగ్ర‌హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్ సినిమా కావ‌టంతో ఈ విడుద‌ల స‌మ‌యంలో హంగామా ఓ రేంజ్ లో ఉండే అవ‌కాశం క‌న్పిస్తోంది. థియేట‌ర్ల‌కు ప్రేక్షకుల‌ను రప్పించేందుకు అవ‌స‌ర‌మైన దినుసులు ఇందులో చాలా ఉన్నాయంటున్నారు.

Next Story
Share it