'ఆర్ఆర్ఆర్' పై అదిరిపోయే అప్ డేట్
BY Admin19 Jan 2021 11:11 AM GMT
X
Admin19 Jan 2021 11:11 AM GMT
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి మంగళవారం నాడు కీలక అప్ డేట్ అందించారు. ' నా రామరాజు, భీమ్ చేతులు కలిపారు. వారు కోరుకున్నది సాధించటానికి' అంటూ క్యాప్షన్ పెట్టి సినిమా క్లైమాక్స్ షూటింగ్ ప్రారంభం అయిందని తెలిపారు.
ఈ ఫోటోను రాజమౌళి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. వాస్తవానికి సంక్రాంతి సందర్బంగా ఏమైనా అప్ డేట్ వస్తుందని ఆశించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే ఆ నిరాశను దూరం చేస్తూ రాజమౌళి కీలక విషయాన్ని వెల్లడించారు. కరోనా టెన్షన్ తగ్గిన వెంటనే ఈ సినిమా పనుల వేగాన్ని పెంచారు రాజమౌళి.
Next Story