ఉక్రెయిన్ బయలుదేరిన ఆర్ఆర్ఆర్ టీమ్
పెండింగ్ ఉన్న పాటల చిత్రీకరణ కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ఉక్రెయిన్ బయలుదేరి వెళ్లింది. ఇప్పటికే సినిమా షూటింగ్ అంతా పూర్తయి..కేవలం రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉన్నవిషయం తెలిసిందే. తుది షెడ్యూల్ కోసం హీరో రామ్ చరణ్ తోపాటు టీమ్ అంతా బయలుదేరి వెళ్లింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే చిత్ర యూనిట్ దోస్తీ సాంగ్ విడుదల చేసి ప్రచారం ప్రారంభించింది. దసరాకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమా మేకింగ్ వీడియో కూడా మంచి ఆదరణ పొందింది. ఇద్దరు టాప్ హీరోల అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి తోడు రాజమౌళి సినిమా కావటం దీనికి మరింత హైప్ ఉంటుందనే విషయం తెలిసిందే.