హౌరా బ్రిడ్జి దగ్గర ఆర్ఆర్ఆర్ టీమ్
ప్రచారం పీక్ కు వెళ్లింది. ఆర్ఆర్ఆర్ విడుదలకు ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చిత్ర యూనిట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తోంది. మంగళవారం నాడు దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కోల్ కత్తాలోని హౌరా బ్రిడ్జి దగ్గర ఇలా మీడియా కు ఫోజులు ఇచ్చారు.. మీడియా సమావేశం నిర్వహించారు. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు టిక్కెట్ ధరలను కూడా భారీగా పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అనుమతులు మంజూరు చేశాయి. దీంతో ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లులు పడనున్నాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ సినిమాకు టిక్కెట్ రేట్లు పెరిగాయి. తెలంగాణలో తొలి మూడు రోజులకు ఓ ధర, తర్వాత వారం రోజులకు మరో ధర అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కారు కూడా ఈ సినిమాకు ప్రత్యేక ధరలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.