Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్ ' విడుద‌ల వాయిదా..అధికారిక ప్ర‌క‌ట‌న‌

ఆర్ఆర్ఆర్   విడుద‌ల వాయిదా..అధికారిక ప్ర‌క‌ట‌న‌
X

అనుకున్న‌ట్లే జ‌రిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల మ‌ళ్ళీ వాయిదా ప‌డింది. వాస్త‌వానికి ఈ ద‌స‌రాకు సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా సంద‌డి చేయాల్సి ఉంది. అయితే క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న థియేట‌ర్లు పూర్తిగా తెరుచుకోని కార‌ణంగా ఈ నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు. ద‌స‌రాకు విడుద‌ల చేసేందుకు వీలుగా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు కూడా చాలా వ‌ర‌కూ పూర్త‌య్యాయ‌న్నారు. థియేట‌ర్లు పూర్తిగా తెరుచుకున్నాక కొత్త తేదీని ప్ర‌క‌టిస్తామ‌ని..అందుకే ఇప్పుడు ఏమీ చెప్ప‌లేక‌పోతున్న‌ట్లు వెల్ల‌డించారు. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ భారీ ప్రాజెక్టులో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు న‌టించిన విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా ఊహించిన‌ట్లుగానే మ‌రోసారి అభిమానుల‌ను నిరాశ‌లో ముంచింది. అంతా సక్ర‌మంగా ఉంటే వ‌చ్చే వేస‌వికే ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. సినిమాల‌కు అత్యంత కీల‌క‌మైన సంక్రాంతి సీజ‌న్ కు ఇప్ప‌టికే ప‌లువురు పెద్ద హీరోల సినిమాలు తేదీలు ప్ర‌క‌టించేసి ఉండ‌టంతో అప్పుడు ఆర్ఆర్ఆర్ స్లాట్ దొర‌క‌టం క‌ష్ట‌మే. అందుకే స‌మ్మ‌ర్ నే ఈ సినిమా టార్గెట్ చేసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Next Story
Share it