Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' నుంచి మ‌రో పాట‌

ఆర్ఆర్ఆర్ నుంచి మ‌రో పాట‌
X

జ‌న‌ని సాంగ్ విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. ప్ర‌తిష్టాత్మ‌క ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి కొత్త అప్ డేట్ వ‌చ్చేసింది. న‌వంబ‌ర్ 26న జ‌న‌ని సాంగ్ ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ సోమ‌వారం నాడు వెల్ల‌డించింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా న్యూ లుక్ ను కూడా విడుద‌ల చేసింది. ఇందులో అజ‌య్ దేవ్ గ‌న్ తోపాటు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల లుక్ ఆక‌ట్టుకుంటోంది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల వేగం పెంచింది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాకు డీవీవీ దాన‌య్య నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు.

Next Story
Share it