Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి
X

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చిన్న చిన్న బిట్స్ మిన‌హా మొత్తం షూటింగ్ పూర్త‌యింద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టిస్తున్న ఈ భారీ మ‌ల్టీ స్టారర్ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలే ఉన్నాయి. వాస్త‌వానికి ఈ సినిమా ద‌స‌రాకు అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర యూనిన్ ప్ర‌క‌టించింది. అయితే ద‌స‌రాకు కూడా ఈసినిమా రావ‌టం లేద‌ని..వ‌చ్చే వేస‌విలోనే విడుద‌ల ఉంటుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు తెలిపాయి. షూటింగ్ పూర్తి కావ‌టంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే మ‌రిన్ని వివ‌రాల‌నుతెలియ‌జేస్తాం'' అంటూ చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ సినిమాలోని అత్యంత కీల‌క‌మైన రెండు పాట‌ల చిత్రక‌ర‌ణ‌కు యూనిట్ ఉక్రెయిన్‌ వెళ్లి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో మ‌న్యంవీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌, గోండు వీరుడు కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. స‌ముద్ర‌ఖ‌ని, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, రే స్టీవెన్ సన్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి ఇలా బాలీవుడ్‌, హాలీవుడ్ తార‌ల‌తో సినిమా తెర‌కెక్కుతోంది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story
Share it