Telugu Gateway

ఆర్ఆర్ఆర్ 'భీమ్' వచ్చాడు

ఆర్ఆర్ఆర్ భీమ్ వచ్చాడు
X

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ హీరో న్యూలుక్ విడుదల చేసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన లుక్ ను సోషల్ మీడియా వేదిక గా పంచుకుంది. చేతిలో బరిసెతో పవర్ పుల్ లుక్ లో ఎన్టీఆర్ కన్పించే ఈ లుక్ ఆయన అభిమానులను అలరిస్తోంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియో మోరిస్ నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Next Story
Share it