రిలాక్స్ మోడ్ లో ఎన్టీఆర్..రామ్ చరణ్!
BY Admin10 Nov 2021 11:05 AM IST
X
Admin10 Nov 2021 11:05 AM IST
నాటు నాటు పాట మధ్య విరామం. ఆర్ఆర్ఆర్ హీరోలు ఎన్టీఆర్. రామ్ చరణ్ లు ఇలా రిలాక్స్ అవుతూ కూర్చున్నారు. ఇద్దరు తమ తమ డ్యాన్స్ లతో ఇరగదీసిన ఈ పాట బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ పాట కోసం అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
దీనికి ఓ ప్రత్యేక కారణం ఉంది. ఇద్దరూ హీరోలు కూడా డ్యాన్స్ లో దుమ్మురేపేవారే కావటం విశేషం. జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అందుకే నిత్యం ఈ సినిమాను వార్తల్లో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
Next Story