ఎన్టీఆర్..రామ్ చరణ్ ను ఎగరేశారు
BY Admin13 April 2021 5:21 AM

X
Admin13 April 2021 5:21 AM
దర్శకుడు రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే ఇద్దరు పెద్ద హీరోల అభిమానులు కలిస్తే ఆ జోష్ మరింత పెరుగుతుంది. ఇఫ్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా విషయంలో అదే జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
వేలాది మంది గుమిగూడి ఎన్టీఆర్, రామ్ చరణ్ లను గాల్లోకి పైకి ఎగరేసిన లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. దర్శకుడు రాజమౌళి ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Next Story