Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ సంచలనం..నాటు నాటుకు ఆస్కార్ నామినేషన్

ఆర్ఆర్ఆర్ సంచలనం..నాటు నాటుకు ఆస్కార్ నామినేషన్
X

దర్శకుడు రాజమౌళి సాధించారు. భారత ప్రభుత్వం నుంచి అధికారిక ఎంట్రీ లేక పోయిన రాజ మౌళి పట్టువీడకుండా జనరల్ కేటగిరీలో తన సినిమాను ఆస్కార్ బరిలో నిలిపేందుకు ప్రయత్నాలు చేశారు. అందులో విజయం సాధించారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకోవటానికి ఒక అడుగు దూరంలో ఉంది. తాజా పరిణామాలతో మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా పేరు మారుమోగిపోతోంది. మంగళవారం సాయంత్రం 95వ అకాడమీ అవార్డ్స్ నామినేషన్స్ జాబితా ప్రకటించారు. అందులోనే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో 'నాటు నాటు' నామినేషన్‌ను దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితమే ఈ పాట కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.

'లాస్‌ఏంజెల్స్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌' అవార్డ్స్‌లో బెస్ట్‌ మ్యూజిక్‌ కేటగిరిలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' గాను కీరవాణి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికయ్యారు. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్‌లో కూడా కీరవాణి పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు.ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలవటంతో అటు ఎన్టీఆర్, ఇటు రాంచరణ్ ఫాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. స్వాతంత్ర్య సమరయోధులైన అల్లూరి సీత రామరాజు, కొమురం భీమ్‌ల కల్పిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని అందుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా ను ఆస్కార్ బరిలో నిలిపేందుకు రాజమౌళి ఒక కన్సల్టెంట్ ను కూడా నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Next Story
Share it