ఆర్ఆర్ఆర్..మూడు గంటల ఆరు నిమిషాల సినిమా
BY Admin17 March 2022 2:44 PM

X
Admin17 March 2022 2:44 PM
ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి మూడు గంటల ఆరు నిమిషాలుగా ఉంది. సెన్సార్ బోర్డు దీనికి యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తొలిసారి ఈ భారీ మల్లీస్టారర్ చిత్రంలో సందడి చే్యనున్నారు. వీరిద్దరికి జోడీలుగా ఒలివియో మోరిస్, అలియాభట్ లు కన్పించనున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుంటే..రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కన్పించనున్న విషయం తెలిసిందే.
Next Story