ఆర్ఆర్ఆర్ విడుదల జనవరి 7న
BY Admin2 Oct 2021 12:28 PM

X
Admin2 Oct 2021 12:32 PM
ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి బిగ్ అప్ డేట్ ఇచ్చింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా విడుదల ముహుర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 7న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ప్రతిష్టాత్మక సినిమాలో తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలసి నటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అగ్రహీరోల అభిమానులు కూడా సినిమా విడుదలపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కన్పించనున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి జోడీలుగా అలియాభట్, హాలీవుడ్ నటి ఒలివియో మోరిస్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్ గన్ కూడా ఓ కీలకపాత్రలో నటించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
Next Story