Telugu Gateway
Cinema

అల్లూరిగా అదిరిపోయిన రామ్ చరణ్

అల్లూరిగా అదిరిపోయిన రామ్ చరణ్
X

రామ్ చరణ్ అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ అదరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ లుక్ ను విడుదల చేసింది. శనివారం నాడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ లుక్ ను విడుదల చేశారు. ఇది ప్ర్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఎన్టీఆర్ కూడా రామ్ చరణ్ లుక్ ను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా సీతగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివా మోరిస్ జెన్నిఫర్ గా నటించనుంది.

Next Story
Share it