Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' ఎత్త‌ర జెండా సాంగ్ విడుద‌ల‌

ఆర్ఆర్ఆర్ ఎత్త‌ర జెండా సాంగ్ విడుద‌ల‌
X

ప‌రాయి పాల‌న‌పై కాలుదువ్వి..కొమ్ములు విదిలించిన కొడెగిత్త‌ల్లాంటి అమ‌ర‌వీరుల‌ను త‌ల‌చుకుంటూ..'నెత్తురు మరిగితే ఎత్త‌ర జెండా.. సత్తువ ఉరిమితే కొట్టర కొండా'అంటూ సాగే పాట‌ను ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసింది. వాస్త‌వానికి ఇది సోమ‌వారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కే విడుద‌ల కావాల్సి ఉన్నా..సాంకేతిక స‌మ‌స్య‌ల‌తో రాత్రి విడుద‌ల చేశారు. మార్చి 25న ఆర్ఆర్ఆర్ ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌కు సిద్ధం కావ‌టంతో చిత్ర యూనిట్ ప్రమోష‌న్ల‌లో వేగం పెంచింది.

అందులో భాగంగానే సినిమా చివ‌రిలో వ‌చ్చే పాట‌ను ముందే విడుద‌ల చేశారు. వాస్త‌వానికి జ‌న‌వ‌రి 7న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా వాయిదాప‌డిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లోనే ప్ర‌మోష‌న్ ను పీక్ కు తీసుకెళ్లినా స‌డ‌న్ గా బ్రేక్ వ‌చ్చింది. దీంతో మ‌రోసారి ప్ర‌మోష‌న్స్ అంటే క‌త్తిమీద సాములాంటి వ్య‌వ‌హారంగా మారింది చిత్ర యూనిట్ కు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియాభ‌ట్ లు ఈ పాట‌లో సంద‌డి చేశారు.

Next Story
Share it