Telugu Gateway
Cinema

'ఆర్ఆర్ఆర్' ను అలా పంచారు

ఆర్ఆర్ఆర్ ను అలా పంచారు
X

రాజమౌళి సినిమా అంటేనే దానికి ఓ రేంజ్ ఉంటుంది. ఇప్పటివరకూ ప్రతి సినిమాలోనూ ఆయన తన సత్తా చూపిస్తూ వస్తున్నారు. ఏ సినిమా తీసినా సూపర్ డూపర్ కమర్షియల్ హిట్ కావాల్సిందే. అందులో రాజమౌళితో కలసి ఇద్దరు భారీ ఫ్యాన్స్ బేస్ ఉన్న హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మల్టీస్టారర్ అంటే అది మరింత క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి..ఓటీటీ, శాటిలైట్ రైట్స్ డీల్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు డీల్ విలువ ఎంతో తెలియదు కానీ..థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఈ సినిమాను ఎవరెవరు..ఏ భాషలో ప్రసారం చేయనున్నారో తేలిపోయింది. దీనికి సంబంధించి అధాకారిక ప్రకటన వెలువడింది. దీని ప్రకారం జీ5, నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నాయి.

ఈ విషయాన్ని పెన్ స్టుడియోస్ ప్రకటించింది. తెలుగు,తమిళ్‌, మలయాళం, కన్నడ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకోగా, హిందీ, విదేశీ భాషల స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ చేజిక్కించుకుంది. ఇక శాటిలైట్‌ హక్కులను కూడా ఒక్కో భాషలో ఒక్కో చానెల్‌ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ హక్కులను స్టార్‌ ఇండియా నెట్‌వర్క్‌ సొంతం చేసుకుంది. ఇక హిందీ హక్కులను జీ నెట్‌వర్క్‌ చేజిక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఇప్పటికే ఈ హక్కులన్నింటినీ పెన్ స్టుడియోస్ దక్కించుకోగా.. ఆ సంస్థ నుంచి ఇవన్నీ ఆ హక్కుల్ని సంపాదించుకున్నాయి.

Next Story
Share it