Telugu Gateway
Cinema

శిల్పారామంలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్

శిల్పారామంలో ఆర్ఆర్ఆర్ హీరోయిన్
X

హాలీవుడ్ న‌టి ఒలివియో మోరిస్ తొలిసారి ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ మూవీలో ప‌లు భాష‌ల‌కు చెందిన న‌టుల‌కు చోటు క‌ల్పించారు. ఈ హాలీవుడ్ న‌టి ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా న‌టిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా క‌న్పించ‌నున్న విష‌యం తెలిసిందే. సినిమా షూటింగ్ కోసం న‌గ‌రానికి వ‌చ్చిన ఆమె శ‌నివారం నాడు న‌గ‌రంలోని పలు చోట్ల ప‌ర్య‌టించింది.

ఈ ఫోటోల‌ను ఒలివియో స్వ‌యంగా త‌న ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. ప్ర‌స్తుతం అవి వైర‌ల్ గా మారాయి. ఒలివియో మోరిస్ 'ఆర్‌ఆర్‌ఆర్‌' కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న అనురెడ్డితో కలిసి శిల్పారామం వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలకు, హస్తకళలకు ఆమె ముగ్ధులయ్యారు. సిటీ విధుల్లో చిరుతిళ్ళు, పానీపూరీలు తింటూ సందడి చేశారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేస‌వికి మాత్ర‌మే విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉందని స‌మాచారం.

Next Story
Share it