Telugu Gateway
Cinema

న‌వంబ‌ర్ 1న 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్

న‌వంబ‌ర్ 1న ఆర్ఆర్ఆర్  గ్లింప్స్
X

ఆర్ఆర్ఆర్ టీమ్ స్పీడ్ పెంచింది. సినిమా విడుద‌ల తేదీ ద‌గ్గ‌రకొస్తుండ‌టంతో ప్ర‌మోష‌న్స్ వేగం పెంచింది. అందులో భాగంగానే న‌వంబ‌ర్ 1న ఈ ప్ర‌తిష్టాత్మ‌క సినిమాకు సంబంధించిన 45 సెకండ్ల గ్లింప్స్ ను విడుదల చేయ‌నున్న‌ట్లు సోషల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. ఎస్ఎస్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా విడుద‌ల ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు కొత్త‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయునున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు జోడీగా న‌టించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా సంద‌డి చేయ‌నున్నారు.

ఇదిలా ఉంటే శుక్ర‌వారం నాడు ముంబ‌య్ లో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పీవీఆర్ థియేట‌ర్స్ తో ఒప్పందం చేసుకున్నారు. దేశంలో తొలిసారి ఓ సినిమా కోసం ఓ కంపెనీ త‌న సొంత బ్రాండ్ ను మార్చుకుంది. మ‌రికొన్ని నెల‌ల పాటు పీవీఆర్ థియేట‌ర్స్ ను పీవీఆర్ఆర్ఆర్ గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 850కి పైగా ఉన్న స్క్రీన్స్..ప్రాప‌ర్టీస్ లో ఇదే పేరు క‌న్పించ‌బోతుంది. దేశ వ్యాప్తంగా 70 న‌గ‌రాల్లో ఈ ప్ర‌భావం ఉండ‌నుంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమాకు నిర్మాత‌గా డీవీవీ దానయ్య వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.

Next Story
Share it