Telugu Gateway
Cinema

ఆర్ఆర్ఆర్ నటుడు ఇక లేరు

ఆర్ఆర్ఆర్ నటుడు ఇక లేరు
X

స్కాట్ దొరగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుత నటన కనపర్చిన ప్రముఖ హాలీవుడ్ నటుడు రే స్టీవెన్‌సన్ కన్నుమూశారు. మే 25 న పుట్టిన రోజు జరుపుకోవాల్సిన అయన ఆకస్మిక మృతి అందరిని షాక్ కు గురి చేసింది. 1964 మే 25న నార్త్ ఐర్లాండ్‌లో జన్మించిన రే పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఐరిష్ నటుడు అయిన రే థోర్ చిత్రంలో ఒక యోధుడిగా కనిపించారు. ఇదికాకుండా స్టార్ వార్స్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. రే స్టీవెన్‌సన్ అసలు పేరు రేమండ్ స్టీవెన్‌సన్. 1998లో ఆయన తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. థియరీ ఆఫ్ ఫ్లైట్ అనే చిత్రంతో తన నటనతో ఆకట్టుకున్నారు.

2008లో వచ్చిన ఔట్ పోస్ట్ సినిమాతో తొలిసారి లీడ్ యాక్టర్‌గా మెప్పించారు. అక్కడ నుంచి పాపులర్ మూవీస్‌, టెలివిజన్ సిరీస్‌లో నటించి ఆకట్టుకున్నారు. ఇందులో ఆర్ఆర్ఆర్, థోర్, డైవర్జెంట్ సిరీస్, వైకింగ్స్, స్టార్ వార్స్ యానిమేటెడ్ సిరీస్ లాంటి పాపులర్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ నటుడు మరణంతో దర్శకుడు రాజమౌళి ట్విటర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు. రే మరణం తనను షాక్‌కు గురిచేసిందని అన్నారు. "ఈ వార్త నాకు షాకింగ్‌గా ఉంది. నమ్మలేకపోతున్నాను. మీరు ఎప్పటికి మా గుండెల్లో ఉంటారు " అని రాజమౌళి ట్వీట్ చేశారు. నిజంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అయన నటన అద్భుతంగా ఉంది అని చెప్పాల్సిందే.

Next Story
Share it