విజయదేవరకొండకు జోడిగా కీర్తి సురేష్

టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ తో కొత్త సినిమా ప్రారంభం అయింది. విజయదేవరకొండ హీరోగా నటిస్తున్న రౌడీ జనార్దన్ మూవీ లో ఆయనకు జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న మొదటి సినిమా ఇదే. కీర్తి సురేష్ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె విజయదేవరకొండకు జోడిగా నటిస్తుండంతో ఈ సినిమాపై ప్రేక్షుకుల్లో ఆసక్తిపెరగటం సహజమే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం నాడు హైదరాబాద్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ఈ సినిమా దర్శకుడు రవి కిరణ్ కోలా, విజయదేవరకొండ, కీర్తి సురేష్, అల్లు అరవింద్ లు పాల్గొన్నారు. ఈ మూవీ నిర్మిస్తున్నది దిల్ రాజు.
రాజావారు రాణి గారు సినిమా దర్శకుడే ఈ రవి కిరణ్ కోలా. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 16 నుంచి ముంబైలో ప్రారంభం కానుంది. ఈ ఏడాది జులై 31 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ మూవీ కింగ్డమ్ బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితానికే పరిమితం అయింది. ఈ మూవీ తర్వాత విజయదేవరకొండ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కలిసి మరో సినిమా చేసే అవకాశం ఉంది..ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



